పబ్లిక్ పాఠశాల మంజూరు చేయాలని వినతి
GDWL: గట్టు మండలంలోని మాచర్ల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ బుడకల వజ్రమ్మ తిమ్మప్ప గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దింటి సుదర్శన్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.