VIDEO: సిద్దిపేటలో మహిళ సూసైడ్
VIDEO: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. గంజి మార్కెట్ ప్రాంతానికి చెందిన శ్రీలత శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.