కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి

కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం కలెక్టరేట్ ముందు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సదరు వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.