VIDEO: కోతుల నుంచి పంట కాపాడేందుకు వినూత్న ప్రయత్నం
WGL: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో రైతు మాధవరావు తన పంటను కోతుల బారి నుంచి కాపాడేందుకు వినూత్న మార్గాన్ని అన్వేషించాడు. రూ.15,000 ఖర్చు చేసి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, చేను చుట్టూ కొండెంగల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీని ద్వారా కోతులను భయపెడుతూ పంటను రక్షించాలనుకుంటున్నాడు. స్థానికులు ఆయన ప్రయత్నాన్ని చూసి వాటెన్ ఐడియా గురూ! అని ప్రశంసిస్తున్నారు.