VIDEO: భక్తులతో కిక్కిరిసిన శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం

VIDEO: భక్తులతో కిక్కిరిసిన శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం

CTR: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం భక్తులతో కిక్కిరిసింది. మంగళవారం వేకువజామునే సుప్రభాత సేవతో శ్రీవారిని అర్చకులు మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసి భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.