'మునగపాక మండలాన్ని అనకాపల్లిలోనే కొనసాగించాలి'
AKP: మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవిన్యూ డివిజన్‌లో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మునగపాకలో చేపట్టిన దీక్షలు శుక్రవారం 5వ రోజుకు చేరుకున్నాయి. మండలాన్ని నక్కపల్లి రెవిన్యూ డివిజన్‌లో కలపవద్దని దీక్షలో కూర్చున్న నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మునగపాకకు ఆనుకొని ఉన్న అనకాపల్లిలోనే ఈ మండలాన్ని కొనసాగించాలన్నారు.