'మన్ కీ బాత్'లో కరీంనగర్ ప్రస్తావన.. మోదీ ఏమన్నారంటే?
TG: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'లో కరీంనగర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ తయారైన సాంప్రదాయ బుద్ధుడి వెండి ప్రతిమను జపాన్ ప్రధానికి, పూల ఆకృతిలో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను ఇటలీ పీఎంకు బహుమతిగా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. భారత కళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికే ఇలా చేస్తున్నానని మోదీ చెప్పారు. దీంతో కరీంనగర్ కళాకారుల్లో ఆనందం వెల్లివిరిసింది.