VIDEO: కుక్కల దాడిలో పాడి ఆవు మృతి

VIDEO: కుక్కల దాడిలో పాడి ఆవు మృతి

KNR: వెన్నంపల్లి-రామచంద్రాపూర్ శివారులో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ పాడి ఆవు మృతి చెందింది. రైతు డప్పు కుమార్ తన వ్యవసాయ బావి వద్ద ఆవును కట్టేసి ఉంచగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. జీవనాధారమైన ఆవు చనిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన వేడుకున్నాడు.