ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
KMM: తిరుమలాయపాలెం మండలం కేశ్వాపురంకి చెందిన వినయ్ (24) అనే యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో పాటు పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురై వినయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తండ్రి రామన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.