మహిళలకు ఇస్తున్న కుట్టుమిషన్లు నాసిరకం

మహిళలకు ఇస్తున్న కుట్టుమిషన్లు నాసిరకం

ప్రకాశం: కొండపి నియోజకవర్గంలో బీసీ మహిళలకు ఇస్తున్న కుట్టుమిషన్లు నాసిరకంగా ఉన్నాయని బీసీ సెల్ అధ్యక్షుడు వసంత్ ఆరోపించారు. బీసీ మహిళలకు జరుగుతున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఒక్కో మహిళకు శిక్షణ, కుట్టుమిషన్ కోసం ప్రభుత్వం రూ.23 వేలు కేటాయిస్తే కాంట్రాక్టర్ కేవలం రూ.7 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు.