బాలికల వసతి గృహంను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

బాలికల వసతి గృహంను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NLG: దేవరకొండ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంను ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పరిసరాలను, వంటగదిని, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులతో సరదాగా ఏ ఊరు, ఎలా చదువుతున్నారు అని మాట్లాడుతూ... విద్యర్థులకు అన్నం వడ్డించారు. నాణ్యతతో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.