నేడు జిల్లాలో తీవ్ర వడగాలులు
E.G: జిల్లాలో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. శనివారం జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వాహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు ఉదయం 11 నుండి సాయంత్రం 4గంటల వరకు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవితాపానికి తగినంత నీరు తీసుకోవాలని, వడదెబ్బలు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.