త్రోబాల్ పోటీల్లో గునుపూడి విద్యార్థుల ప్రతిభ

AKP: నాతవరం మండలంలోని గునుపూడి హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 21 ,22వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో గునుపూడి హైస్కూల్ విద్యా ర్థులు లగుడు అరవింద్, మత్తుర్తి భార్గవ్ ధనుష్ త్రోబాల్ పోటీలలో తృతీయస్థానం సాధించారు. వీరిని మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. శివజ్యోతి, ఎస్ఎంసి చైర్మన్ సత్యవతి అభినందించారు.