ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
WGL: సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని TNGOS జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్ కిషన్ కొనియాడారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దేశాయిపేటలోని ఆయన విగ్రహానికి టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ చూపిన బాటలో నడవాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.