త్వరలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు: కలెక్టర్

త్వరలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు: కలెక్టర్

WNP: వయోవృద్ధుల సంరక్షణ కోసం వనపర్తి జిల్లాలో త్వరలోనే ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో వయోవృద్ధులకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు ఆలనా పాలన చూసుకోవాలన్నారు. అలాగే వారికి మరి కొద్ది రోజుల్లో గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు.