కడప రిమ్స్‌లో స్ట్రెచర్‌పై చెత్త రవాణా

కడప రిమ్స్‌లో స్ట్రెచర్‌పై చెత్త రవాణా

కడప రిమ్స్‌లో గురువారం ఉదయం అత్యవసర సేవలకు వినియోగించాల్సిన స్ట్రెచర్‌పై చెత్త సంచులు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రోగులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.