దోమకొండలో ఎన్నికల ప్రచార హోరు
KMR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11వ తేదీన దోమకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి రెండే రోజులు గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని హోరేత్తించారు.