'దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం'

SRPT: దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలో రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో ఐటీ, టెలిగ్రాం రంగాలు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే అభివృద్ధి చెందాయన్నారు. రాజీవ్ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడాలని సూచించారు.