దుప్పి మాంసాన్ని దహనం చేసిన అధికారులు
BDK: అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం గ్రామంలో గత మూడు రోజుల క్రితం దుప్పి మాంసంను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 10 కిలోల దుప్పి మాంసాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసిన విషయం విధితమే. కాగా మంగళవారం అశ్వాపురం ఎఫ్ఆర్‌వో ఉపేందర్ ఆధ్వర్యంలో వెటర్నరీ డాక్టర్ షేక్ ఫర్హీనా పంచనామ నిర్వహించి మాంసాన్ని దహనం చేశారు.