తమిళ జాలర్లపై శ్రీలంక దొంగలు దాడి

తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 17మంది గాయపడ్డారు. నాగపట్నం జిల్లాకు చెందిన 30మంది జాలర్లు కోరమండల్ తీరంలో చేపల వేటకు వెళ్లగా.. ఒక్కసారిగా వీరిపై ఆరుగురు దొంగలు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. వెంటనే ఓడ్డుకు వచ్చిన వీరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దొంగలు పడవల్లోని వలలు, GPS పరికరాలను దోచుకుని వెళ్లారు.