పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం

ATP: రొళ్ల మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. శనివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో తహసీల్దార్ షేక్షావలి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాలలకు చెందిన అధ్యాపకులు, స్థానిక టీడీపీ నేతలు కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన పలువురు మహిళలు, పురుషులు యోగాసనాలు వేశారు.