దేశ సమైక్యత తెలిపే కవితలు రావాలి: మాజీ ఎంపీ

కర్నూలు: ప్రస్తుత పరిస్థితులు కవులు దేశ సమైక్యత మతసామరస్యం శాంతి అంశాల మీద తమ కవితలను చెప్పాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కర్నూల్ నగరంలోని టీజీవి క్షేత్రంతో గద్వాల ఈరన్న రచించిన కవిగుర గంప పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. గద్వాల ఈరన్న ఆర్టీసీ ఉద్యోగ పదవీ విరమణ చేసిన తర్వాత చక్కని కవితలు రాశాడని, వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.