భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న కలెక్టర్

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న కలెక్టర్

BDK: భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం దర్శించుకున్నారు. రామయ్యకు కలెక్టర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్ రావు జిల్లా కలెక్టర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ కలెక్టర్‌కు వేద ఆశీర్వచనం అందజేసి రాములోరి తీర్థప్రసాదాలను అందజేశారు.