ఒకే కుటుంబంలో నలుగురికి తల్లికి వందనం

ఒకే కుటుంబంలో నలుగురికి తల్లికి వందనం

సత్యసాయి: రొళ్ల మండలం ఎస్సీ కాలనీకి చెందిన భూతన్న చంద్రమ్మ దంపతులకు నలుగురు పిల్లల సంతానం. అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ఆ కుటుంబానికి 'తల్లికి వందనం' పథకం ఎంతో ఊరటనిచ్చింది. నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున రూ.52 వేలు తల్లి ఖాతాలో జమైంది. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.