పుంగనూరులో జ్యోతిరావు పూలే వర్ధంతి

పుంగనూరులో జ్యోతిరావు పూలే వర్ధంతి

CTR: పుంగనూరు పట్టణంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని శుక్రవారం బీసీ సంఘం నాయకులు నిర్వహించారు. స్థానిక ముడెప్ప కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై రమణ మాట్లాడుతూ... పూలే భారతదేశంలో సంఘ సంస్కరణకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితాన్ని, సేవలను గుర్తు చేశారు.