మాటూరులో ఉచిత వైద్య శిబిరం
BHNG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో మాటూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జిన్నే సిద్దులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉచిత వైద్య పరీక్షలు పేదలకు ఎంతో మేలు చేస్తాయని, వీటిని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధునిక జీవనశైలి మార్పుల వల్ల వచ్చే బీపీ, షుగర్ వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.