జి.కొండూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఎన్టీఆర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని టీడీపీ నాయకులు శనివారం రాత్రి జి. కొండూరు మండల కేంద్రంలోని లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసాను ఇస్తుందని వారు అన్నారు. లబ్ధిదారులకు ₹75 వేలు పైచిలుకు విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వారు అందజేశారు.