ఆంధ్రరత్న భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం
NTR: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్‌కు కాంగ్రేస్ నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, సమ్మిళితమైన, సాధికారత కలిగిన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగి జీ, నేతలు ఉన్నారు.