చీమల స్మగ్లింగ్..వ్యక్తి అరెస్ట్
కెన్యా నుంచి అరుదైన రాణీ చీమల స్మగ్లింగ్ చేస్తున్న చైనాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కెన్యాలోని నైరూబీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ రకం చీమలకు అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒప్పందాల కింద రక్షణ కల్పించారు. వీటి విక్రయించడంపై తీవ్రమైన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతడి నుంచి మొత్తం 2,000 రాణీ చీమలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.