సీఐటీయూలో చేరిన ఆశా వర్కర్లు

KMM: మధిర మండలం దెందుకూరు పీ.హెచ్.సీ కేంద్రానికి చెందిన 31 మంది ఆశా వర్కర్లు సీఐటీయూ లో చేరారు. మంగళవారం వారిని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం నరసింహారావు ఆహ్వానించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు, పనిగంటలు తగ్గింపు, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యతతో ఉద్యమాలను బలపరచాలని పిలుపునిచ్చారు.