'ఎరువుల సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలి'

KMM: తెలంగాణలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఎరువుల సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని కోరారు. గురువారం రసాయన, ఎరువుల శాఖ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాజ్యసభ సభ్యుడు వినతి పత్రం అందించారు. వరి నాట్లు పడుతున్న ఈ కీలకమైన సమయంలో ఎరువుల కోత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.