పాలకొండలో రైతుల విజయోత్సవ ర్యాలీ

PPM: రైతులకు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పాలకొండలో ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జయకృష్ణ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నుంచి ఏఎంసీ కార్యాలయం వరకు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.