బోథ్‌లో ఓటు వేసిన శతాధిక వృద్ధురాలు
ADB: బోథ్ పట్టణములో 9వ వార్డుకు చెందిన శతాధిక వృద్ధురాలు (103 సంవత్సరాలు) పూండ్రు యమునా బాయి తన ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు. వృద్ధురాలి కొడుకు పూండ్రు లక్ష్మారెడ్డి తన తల్లి ఓటు వేయడంలో సహాయపడ్డాడు. శతాధిక వృద్ధురాలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.