ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక

ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక

KMM: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు మధిర తాహసీల్దార్ రమాదేవి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మధిర మండల పరిధిలో కలకోట, బ్రాహ్మణపల్లి, రామన్న‌పేట ఇసుక రీచ్‌ల నుంచి పంపిణీ చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. తాహసీ‌ల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసిన కూపన్‌లను మూడు రోజులలో ఉపయోగించుకోవాలని తెలిపారు.