VIDEO: భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
WGL: భద్రకాళి దేవాలయంలో ఇవాళ ఉదయం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. వస్త్రాలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు నగరం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పూజానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.