భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా బుర్ర కొమురయ్య
భూపాలపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక జరిగింది. ఛైర్మన్‌గా బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్‌గా అంబాల శ్రీనివాస్ (కాంగ్రెస్) ఎన్నికయ్యారు. పాలకవర్గ సభ్యుల సమక్షంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో 2 ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కు సభ్యులు అభినందనలు తెలిపారు. కాగా, కాంగ్రెస్ స్పష్టమైన మోజార్టీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.