VIDEO: డ్రోన్ నిఘాతో కడపలో పోలీసుల కఠిన చర్యలు
కడపలో గంజాయి, బహిరంగ మద్యం సేవనం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ నిఘాతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచి నిందితులను గుర్తిస్తున్నారు. పట్టుబడిన వారిపై కౌన్సిలింగ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు నిషేధిత కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.