VIDEO: బోరుబావి నుంచి ఉబికి వస్తున్న నీరు
NRML: తానూర్ మండలంలో ఓ బోరు బావి నుంచి నీరు ఉబికి వస్తోంది. బామ్ని గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఉన్న బోరు బావి నుండి కరెంటు లేకున్నా నీరు ఉబికి వస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఉప్పొంగుతున్న జలాలను చూసి స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.