నూతన గృహప్రవేశ వేడుకలలో మాజీ మంత్రి
WNP: శ్రీ రంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామానికి చెందిన నందిపేట శివయ్య ఇటీవలే నూతన గృహం నిర్మించారు. అట్టి గృహ ప్రవేశానికి మాజీమంత్రి నిరంజన్ రెడ్డిని ఆహ్వానించగా ఆయన శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండోస్ ఛైర్మన్ జగన్నాథం నాయుడు, ఆంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.