రోడ్డుపైన వృద్ధురాలిని వదిలేసిన కుటుంబం

KRNL: తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు గత నెల రోజులుగా ఆశ్రయం పొందుతోంది. ఆమె సొంతూరు గుత్తి పట్టణం అని చెబుతున్నా, కుటుంబ సభ్యులు నెలనెలా పింఛను సొమ్ము తీసుకుని ఆమెను అక్కడే వదిలేసి వెళ్తున్నారు. శుక్రవారం వృద్దురాలిని గమనించిన గ్రామస్థులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించాలని అధికారులను కోరుతున్నారు.