'పాలకులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'
NLG: పాలకులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడలోని CPM ఆఫీసులో నిర్వహించిన అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఇవాళ మాట్లాడారు. రాష్ట్రంలో పాలకులంతా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మానుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు.