అక్రమ గ్రావెల్ రవాణా.. 8లారీలు సీజ్
KKD: పెద్దాపురం ప్రాంతంలో విజిలెన్స్, మైన్స్ శాఖ అధికారులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్న ఎనిమిది టిప్పర్ లారీలను అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. సీజ్ చేసిన లారీలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.