అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం: ఎస్పీ

అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం: ఎస్పీ

NGKL: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ, బాధ్యతగల పౌరులుగా విధులను నిర్వర్తించాలని కోరారు. సామాజిక విప్లవ దార్శనికుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.