ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా ఆమె చేసిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత- భాస్కర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.