ఈనెల 25 నుంచి CITU రాష్ట్ర మహాసభలు: జయలక్ష్మి
ADB: ఈనెల 25, 26వ తేదీల్లో జిల్లా కేంద్రంలో CITU రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. శనివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలనే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.