చోరికి పాల్పడిన నిందితులకు రిమాండ్
VZM: 2025 ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని సీతంపేటలో ఉన్న బండి అమ్మవారు ఆలయం, దేవి గుడి జంక్షన్ వినాయకుని ఆలయంలో హుండీలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.