'దీపావళి మందును అక్రమంగా నిర్వహించితే సహించేది లేదు'
ప్రకాశం: దీపావళి మందులను అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తే సహించేది లేదని మార్కాపురం గ్రామీణ ఎస్సై అంకమ్మరావు సూచించారు. పలు దుకాణాలను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం దుకాణాల యజమానులతో సమావేశాన్ని నిర్వహించి, దీపావళి మందులను అక్రమంగా నిలువ ఉంచరాదని అలా ఉంచితే చట్టరీత్యా చర్యలను తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.