గ్రామంలో త్రాగునీటికి ఇక్కట్లు.. ఖాళీ బిందెలతో నిరసన

ASR: రాజవొమ్మంగి మండలంలోని దూసరిపాము గ్రామంలో కొత్తవీధి మహిళలు తమకు నాలుగు నెలలుగా తాగునీరు అందడం లేదంటూ ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.