VIDEO: మున్సిపల్ కార్యాలయం ఎదుట BRS కౌన్సిలర్ల నిరసన

VIDEO: మున్సిపల్ కార్యాలయం ఎదుట BRS కౌన్సిలర్ల నిరసన

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో ఇవాళ కారు పార్కింగ్ అంశంపై వివాదం చెలరేగింది. ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి బాల్కనీలో వ్యక్తిగత వాహనం నిలిపిన విషయంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగి, ఛైర్మన్ కౌన్సిలర్‌ను దుర్భాషలాడడంతో కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.