సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు
VZM: సఫాయి కర్మచారి యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని, ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు.